ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటీటీలో ఆకట్టుకుంటున్న హారర్ థ్రిల్లర్ 'ఈషా' మూవీ

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 19, 2026, 02:04 PM

గతేడాది థియేటర్లలో విడుదలై, మంచి విజయం సాధించిన 'ఈషా' అనే హారర్ థ్రిల్లర్ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. దెయ్యాలు, ఆత్మలు లేవని నమ్మే నలుగురు స్నేహితులు, ఆదిదేవ్ బాబా సవాలును స్వీకరించి, ఒక పాడుబడిన బంగ్లాలో మూడు రోజులు గడిపే కథాంశంతో ఈ సినిమా ఆకట్టుకుంటోంది.  మరి ఆ పాడుబడ్డ బంగ్లాలో వారికి ఎదురైన భయానక పరిస్థితులు ఏమిటి? పుణ్యవతి అనే ఆత్మకు, గిరిజనుడైన మైమ్ మధుకు ఉన్న సంబంధం ఏమిటి? చివరకు ఆ మిత్రులు ఆత్మలు, దెయ్యాలు ఉన్నాయని నమ్మారా? లేదా? అన్నప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఈ హారర్ థ్రిల్లర్ సినిమా చూడాల్సిందే.ఒళ్లు గగుర్పొడిచే సీన్లు, ఊహించని ట్విస్టులతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ సినిమా IMDBలో 9.3 రేటింగ్ సాధించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa