ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మృణాల్ ఠాకూర్ బ్రేకప్ రహస్యం వెలుగులోకి!

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 19, 2026, 02:00 PM

టాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తన కెరీర్ తొలి రోజుల్లో బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. సినీరంగంలోకి వచ్చిన మొదట్లో తన బాయ్ ఫ్రెండ్, తాను అగ్ర హీరోల సరసన నటిస్తున్నానని, తనను ఎక్కడ విడిచిపెడతానోనని ఆందోళనకు గురయ్యాడని, తనను తాను నిరూపించుకోవడానికి జిమ్ కు వెళ్లి 20 కిలోలు బరువు తగ్గానని, కానీ తర్వాత మళ్ళీ బరువు పెరిగి జిమ్ మానేశానని మృణాల్ వెల్లడించారు. తన చుట్టూ ఉండే సినీతారలతో పోటీపడలేనని అతడు చెప్పాడని, ఆ తర్వాత కొన్నాళ్లకే తాము విడిపోయామని ఆమె తెలిపారు. ప్రేమ, బ్రేకప్ గురించి మాట్లాడిన మృణాల్ తన గురించి వస్తున్న రూమర్స్ అవాస్తవమని అన్నారు. ఫిట్నెస్, లుక్స్ విషయంలో ఇతరులతో పోల్చుకోవడం వల్ల ఎంత ఒత్తడికి గురవుతారో అతడిని చూశాకే తెలిసిందని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa