చిరంజీవి నటిస్తున్న 'సైరా' మూవీ తరువాత కొరటాల శివతో మూవీ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. నవంబర్లో ఈ సినిమా మొదలవుతుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు తరువాత చిరంజీవి - త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుంది. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా ధ్రువీకరించారు. 'సైరా' ప్రమోషన్స్ లో ఆయన మాట్లాడుతూ, త్రివిక్రమ్ గురించి ప్రస్తావించారు. త్రివిక్రమ్ తనకి ఇటీవల ఒక లైన్ వినిపించాడని అన్నారు. ప్రస్తుతం పూర్తి కథపై కసరత్తు జరుగుతోందని చెప్పారు. పూర్తి వినోదభరితంగా ఆ కథ నడుస్తుందని అన్నారు. చిరూతో పనిచేయాలనే త్రివిక్రమ్ ముచ్చట .. ఆయన సినిమా చేయాలనే చిరూ కోరిక త్వరలో తీరబోతున్నాయన్న మాట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa