నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరోసారి అంతర్జాతీయ వేదికపై మెరవనుంది. ప్రఖ్యాత క్రంచీరోల్ యానిమే అవార్డుల వేడుకలో ఆమె ప్రెజెంటర్ గా ఎంపికయ్యారు. 2024 తరువాత రెండోసారి ఈ అంతర్జాతీయ వేదికపై కనిపించనున్న రష్మిక, మే 23న జపాన్ లో జరగనున్న యానిమే అవార్డుల వేడుకలో పాల్గొంటారు.యానిమేటెడ్ చిత్రాలు, వెబ్‌సిరీస్‌లలో ప్రతిభ కనబరిచిన వారికి ఇచ్చే ఈ పురస్కారాల 10వ ఎడిషన్ వేడుక మే 23న టోక్యోలో ఘనంగా జరగనుంది. ఈ సందర్బంగా హాలీవుడ్ ప్రముఖులతో కలిసి ఆమె విజేతలకు అవార్డులు అందజేయనున్నారు. ‘పుష్ప’ సినిమాలోని శ్రీవల్లి పాత్రతో రష్మిక(Rashmika)కు జపాన్‌లో భారీ క్రేజ్ ఏర్పడింది. అభిమానులను సైతం సంపాదించుకున్నారు రష్మిక. ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆమె మైసా, రణబాలి సినిమాలు చేస్తున్నారు. భారీ అంచనాలు ఉన్న ఈ రెండు సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa