వైవిధ్యభరితమైన కథాంశంతో తెరకెక్కుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘ది రెడ్ బ్యాగ్’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఒక బ్యాగ్ చుట్టూ తిరిగే ఆసక్తికరమైన కథతో రూపొందుతున్న ఈ చిత్ర పోస్టర్‌ను యువ హీరో దినేష్ తేజ్, దర్శకుడు హరి ప్రసాద్ కలిసి లాంచ్ చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. హరికృష్ణ సోమిశెట్టి నిర్మాణంలో, రవి కుమార్ శీరపు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa