విజయ్ దేవరకొండ తన పనితీరులో కీలక మార్పులతో సినీ పరిశ్రమను ఆశ్చర్యపరుస్తున్నాడు. గతంలో ఒక సినిమా పూర్తయ్యే వరకు మరో సినిమాను ప్రారంభించేవాడు కాదు. ఇప్పుడు ఆ పద్ధతిని మార్చి, 'రణబాలి', 'రౌడీ జనార్దన' చిత్రాల షూటింగ్‌లను ఏకకాలంలో పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. కొత్తగా పెళ్లయినా షూటింగ్‌లపైనే ఫోకస్ చేయడం ఆసక్తికరం. ఈ క్రమంలో, 'హాయ్ నాన్న' ఫేమ్ శౌర్యువ్ దర్శకత్వంలో, విక్రమ్ కె. కుమార్ ప్రాజెక్టును కూడా ఏకకాలంలో పట్టాలెక్కించడానికి ప్రణాళికలు రచిస్తున్నాడు. దీంతో ఏడాదికి కనీసం రెండు నుండి మూడు సినిమాలు విడుదలయ్యేలా విజయ్ వ్యూహం కనిపిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa