నేచురల్ బ్యూటీ సాయి పల్లవి, మిల్కీ బ్యూటీ తమన్నాకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒక ఛాలెంజ్ విసిరారు. అది మొక్కలు నాటే ఛాలెంజ్. అఖిల్ అక్కినేని విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించి పూర్తిచేసిన వరుణ్.. ఇప్పుడు సాయి పల్లవి, తమన్నాకు విసిరారు. తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ అయిన జోగినపల్లి సంతోష్ కుమార్ రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచాలనే లక్ష్యంతో గ్రీన్ ఛాలెంజ్ పేరిట ఒక వినూత్న కార్యక్రమాన్ని మొదలెట్టిన సంగతి తెలిసిందే. ఎంపీ సంతోష్ కుమార్ ఇచ్చిన పిలుపునకు రాష్ట్ర వ్యాప్తంగా సామాన్య ప్రజానీకం నుండి ప్రజాప్రతినిధులు, సెలబ్రిటీల వరకు అందరూ స్పందించి విస్తృత స్థాయిలో మొక్కలు నాటారు. ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ పేరుతో ఎంపీ సంతోష్ చాలా మంది ప్రజాప్రతినిధులు, సెలబ్రిటీలకు ఈ ఛాలెంజ్ విసిరారు. ఈ సెలబ్రిటీల్లో అఖిల్ అక్కినేని కూడా ఉన్నారు. ఆ తరవాత అఖిల్ ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను సోదరుడు నాగచైతన్య, వరుణ్ తేజ్‌కు విసిరారు. ఎంపీ సంతోష్ కుమార్ ఇచ్చిన పిలుపునకు రాష్ట్ర వ్యాప్తంగా సామాన్య ప్రజానీకం నుండి ప్రజాప్రతినిధులు, సెలబ్రిటీల వరకు అందరూ స్పందించి విస్తృత స్థాయిలో మొక్కలు నాటారు. ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ పేరుతో ఎంపీ సంతోష్ చాలా మంది ప్రజాప్రతినిధులు, సెలబ్రిటీలకు ఈ ఛాలెంజ్ విసిరారు. ఈ సెలబ్రిటీల్లో అఖిల్ అక్కినేని కూడా ఉన్నారు. ఆ తరవాత అఖిల్ ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను సోదరుడు నాగచైతన్య, వరుణ్ తేజ్‌కు విసిరారు. కాగా, ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన వారందరికీ వనమిత్ర అవార్డ్స్ ఇవ్వనున్నట్లు ఎంపీ సంతోష్ కుమార్ ప్రకటించారు. దీంతో పాటు మొక్కలు నాటినవారికి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వనమిత్ర బ్యాడ్జ్ ఆఫ్ హానర్ అవార్డ్స్ ఇవ్వాలని ఇప్పటికే ఇగ్నైటింగ్ మైండ్స్ సంస్థ నిర్ణయించింది. మొక్కలు నాటిన వారందరికీ వనమిత్ర అవార్డులను త్వరలో అందజేస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa