సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ కి దసరా గిఫ్ట్ రెడీ చేశారు. రేపు దసరా సందర్భంగా సరిలేరు నీకెవ్వరూ చిత్రం నుండి ఓ స్పెషల్ పోస్టర్ విడుదల చేయనున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ కొద్దిసేపటి క్రితం ఒక పోస్టర్ తో కూడిన అప్డేట్ ఇవ్వడం జరిగింది. రేపు సాయంత్రం 5:04నిమిషాలకు ఈ కొత్త పోస్టర్ విడుదలకు ముహూర్తం నిర్ణయించారు. మూవీ పోస్టర్లో మూవీ టీజర్ లేదా, లిరికల్ సాంగ్ విడుదల తేదీ ప్రకటించే అవకాశం కలదు. ఇప్పటికే సరిలేరు నీకెవ్వరూ మూవీలోని మహేష్ ఆర్మీ మేజర్ లుక్స్ బయటకి రాగా విశేష స్పందన లభించింది. దాదాపు 75శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలతో పాటు, పాటలు చిత్రీకరించాల్సివుంది. మహేష్ సరసన రష్మిక మందాన నటిస్తున్న ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ విజయ శాంతి ఓ కీలకపాత్ర చేస్తున్నారు. దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందిస్తుండగా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది విడుదల అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa