ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అభిమానులను నిరాశ పరిచిన 'ఆర్.ఆర్.ఆర్' టీమ్

cinema |  Suryaa Desk  | Published : Fri, Oct 11, 2019, 06:41 PM

ఇండియా లో మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీగా ఆర్.ఆర్.ఆర్ పేరు మార్మోగుతోంది. సాహో.. సైరా తర్వాత ఈ వరుసలో రాబోతున్న సినిమా ఇది. పైగా బాహుబలి దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి నుంచి వస్తున్న సినిమాగా ఆ క్రేజే వేరు. అయితే అలాంటి క్రేజీ మూవీపై ఇటీవల రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ సినిమా చిత్రీకరణ ఆలస్యమవుతోందని.. ముందే ప్రకటించినట్టు ఇన్ టైమ్ లో రిలీజయ్యే అవకాశం లేదు.. అంటూ సందేహం వ్యక్తం చేస్తూ మీడియాలో కథనాలు వచ్చాయి.


అయితే ఇలాంటి రూమర్లను ఖండిస్తూ డీవీవీ సంస్థ కానీ.. రాజమౌళి కానీ ఎలాంటి ప్రకటనను చేయలేదు. కనీసం పండగలు పబ్బాలతో పాటు బర్త్ డేల వేళ అయినా అన్ని రూమర్లకు చెక్ పెడుతూ ఏదైనా హింట్ ఇస్తున్నారా? అంటే అదీ లేదు. ఈ దసరా సందర్భంగా రామ్ చరణ్.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఆశించారు. కానీ ఏదీ రివీల్ కాలేదు. అలాగే 10 అక్టోబర్ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి బర్త్ డే సందర్భంగా .. అభిమానులకు ఏదైనా గిఫ్ట్ ఉంటుందని భావిస్తే తీవ్ర నిరాశ ఎదురైంది. తనకు శుభాకాంక్షలు అందించిన ఫ్యాన్స్ కు మాత్రం థాంక్స్ అంటూ సరిపుచ్చాడు జక్కన్న. అయితే ఆర్.ఆర్.ఆర్ కి సంబంధించిన ఏ అప్ డేట్ రాకపోవడం మాత్రం అభిమానుల్ని నిరాశపరిచింది.


ఫస్ట్ లుక్ పోస్టర్లు కానీ.. టైటిల్ వివరం కానీ చెబుతారు అనుకుంటే అస్సలు అలాంటి ప్రయత్నమే కనిపించలేదు. బర్త్ డే సందర్భంగా కనీసం ఆర్.ఆర్.ఆర్ మేకింగ్ వీడియోని ఏదైనా రిలీజ్ చేస్తారా? అని ఆశగా ఎదురు చూశారు. ప్రతిసారీ రాజమౌళి బర్త్ డే కి ఏదో ఒక మెరుపు లాంటి వార్త ఉండేది. అయితే ఈసారి మాత్రం అది లేనేలేదు. ఇలా జరగడానికి కారణమేంటి? అని అభిమానులు తర్జనభర్జన పడుతున్నారు. ఒకవేళ రాజమౌళి ఏదైనా వర్రీలో ఉన్నారా?  జూలై 2020 రిలీజ్ అంటూ ఒక తేదీని ప్రకటించారు కాబట్టి అప్పటికి సాఫీగా రిలీజ్ చేయాలనే టెన్షన్ తప్ప వేరొకటి పెట్టుకోదలుచుకోలేదా?  అంటూ ఆసక్తికరంగా చర్చ సాగుతోంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa