ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప‌వ‌న్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయికి రెండు ద‌శాబ్దాలు

cinema |  Suryaa Desk  | Published : Fri, Oct 11, 2019, 08:58 PM

టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి తర్వాత మళ్లీ ఆ స్థానం అందుకున్న పవన్ కల్యాణ్ మొదటి చిత్రం “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి” 11అక్టోబర్ 1996న రిలీజైంది.రెండు దశాబ్ధాలు పూర్తి చేస్కుని 23ఏళ్ల పాటు టాలీవుడ్ లో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న హీరోగా పేరొందాడు.చేసే పనిని మనస్ఫూర్తిగా చేయాలన్న సిద్ధాంతాన్ని నమ్మే ఈ పవర్స్టార్ నటించింది కేవలం 25సినిమాలు.స్టైలిష్ యాక్టింగ్ గొప్ప మనసు, సింపుల్ లైఫ్ స్టైల్ వల్ల మిలియన్ల కొద్దీ అభిమానులని సంపాదించుకున్నారు.
ఇటీవల రాజకీయాల్లో ప్రవేశించి జనసేన పార్టీని స్థాపించి రాజకీయాల్లో మాత్రం పేరు సాదించలేక పోయారు.సినిమాలు రాజకీయాలు వేరు వేరు కాబట్టి ఏపీ రాజకీయాల్లో విపక్షపాత్రలో జనసేన నాయకుడిగా ఉన్నారు. పవన్ కల్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి వస్తారా అనేది ప్రశ్నార్థకమే.. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ మధ్యే కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ అధినేత రామ్ చరణ్ పవన్ నటిస్తే నిర్మాణ సారద్యానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పలువురు దర్శకులు, నిర్మాతలు ఇంకా ఆయన అభిమానులు కూడా పవన్ తిరిగి సినిమాల్లో రావాలని కోరుకుంటున్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa