ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త‌మిళ బిగ్‌బాస్ - 3 విజేత ముగేన్ రావ్

cinema |  Suryaa Desk  | Published : Fri, Oct 11, 2019, 10:29 PM

బిగ్ బాస్ ఇప్పుడు మ‌న దేశంలో అతిపెద్ద టివి ప్రోగ్రామ్. తమిళంలో లోక నాయకుడు క‌మ‌ల్ హోస్టింగ్ చేస్తున్న ఈ కార్య‌క్ర‌మం విజయవంతం గా మూడవ సీజన్ కూడా ముగించుకుంది. ఈ మూడవ సీజన్లో ముగేన్ రావ్ బిగ్ బాస్ టైటిల్ గెలిచుకున్నాడు. ఈ ముగేన్ రావ్ తెలుగు మూలాలు ఉన్న మలేషియా దేశ పౌరుడు. తన చిన్న తనంలోనే తల్లితండ్రుల మధ్య గొడవలు జరిగి విడిపోవ‌టంతో  ఒత్తిడికి గురై ముగేన్ రావ్ మలేషియన్ గ్యాంగ్ లో కొంత కాలం పని చేశాడు. ఆపై  తమిళ సినీ పరిశ్రమలో ముగేన్ రావ్ గాయకుడిగా అడుగు పెట్టి ఆల్బమ్ ల‌ని  చేయడం మొదలు పెట్టాడు. అలా బిగ్ బాస్ 3 లో అవకాశం వచ్చింది. మొదటి రోజు నుండి చివరి వరకు చాలా పరిపక్వత కలిగి ఆటను అర్థం చేసుకొని త‌న‌దైన తీరులో ప్రేక్షకుల హృదయాలు గెలిచాడు. ఆట మధ్యలో అభిరామి అనే కంటెస్టెంట్ తో ప్రేమాయణం సాగించడంతో  కొంత వెనుకబడి న‌ట్టు క‌నిపించినా తిరిగి తనదైన శైలిలో తోటి సభ్యులందరినీ వెనక్కి నెట్టి విజేతగా నిలిచాడు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa