నాగ చైతన్య నటించిన ‘ఒకలైలా కోసం’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే ఆతరువాత వరుణ్ తేజ్ లాంచింగ్ మూవీ ‘ముకుంద’లో ట్రెడిషన్ గర్ల్ గా అలరించింది. ఈ మూవీ తరువాత ఆమె ఏకంగా బాలీవుడ్ మూవీ ‘మొహంజోదారో’ లో హృతిక్ సరసన నటించే అవకాశం దక్కించుకుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ అనుకున్నంత సక్సెస్ కాకపోవడంతో ఆమెకు బాలీవుడ్ లో అవకాశాలు రాలేదు. మళ్ళీ టాలీవుడ్ లోనే అల్లు అర్జున్ సరసన దువ్వాడ జగన్నాధం చిత్రంలో అవకాశం దక్కించుకొని తెలుగులో వరుస ఆఫర్స్ దక్కించుకుంటూ ముందు కెళుతుంది. కాగా నేడు పూజా హెగ్డే పుట్టిన రోజు పురస్కరించుకొని విషెష్ చెవుతూ, తాజా చిత్రం అలవైకుంఠపురంలో మూవీ నుండి పూజా తో కూడిన పోస్టర్ ఒకటి విడుదల చేశారు. రెడ్ బాక్సింగ్ గ్లోవ్స్ ధరించుకొని ఎవరినో రఫ్ ఆడేస్తున్నట్లున్న ఆ పోజ్ ఆసక్తికరంగా ఉంది. సాఫ్ట్ వేర్ కంపెనీ యజమాని పాత్రలో కనిపించనున్న పూజా, సీరియస్ లేడీ బాస్ గా అలరిస్తారని సమాచారం. బన్నీ కూడా అదే కంపెనీలో ఉద్యోగి కావడంతో పూజా లేడీ బాస్ గా బన్నీని ముప్పతిప్పలు పెట్టనుందని వినికిడి. పూజా ప్రేమకోసం తపించే మధ్యతరగతి యువ ఉద్యోగి అయిన బన్నీ, అసలు పట్టించుకోని కంపెనీ యజమానిగాపూజా మరియు వీరిద్దరి మధ్య సాగే ఆఫీస్ ఎపిసోడ్స్ ఆసక్తికరంగా సాగుతాయట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa