ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముక్కు పోగుతో అనసూయ న్యూ లుక్ ..

cinema |  Suryaa Desk  | Published : Sun, Oct 13, 2019, 01:52 PM

అనసూయ ఈ పేరు తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతలా ఆమె 'జబర్దస్త్' షో ద్వారా తెలుగువారికి దగ్గరైంది. అంతేకాదు బుల్లితెరకు గ్లామర్ అద్దిన అతికొద్ది మంది యాంకర్లలలో ఈ భామ కూడా ఒకరు. అయితే అనసూయ కేవలం టీవీ యాంకరింగ్‌ మాత్రమే పరిమితం కాకుండా సినిమాల్లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ అక్కడ కూడ దూసుకుపోతోంది. అందులో భాగంగా.. విజయ్ దేవరకొండ నిర్మాతగా కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై వస్తోన్న ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది అనసూయ. ఇతర ప్రధాన పాత్రల్లో తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం,  వాణి భోజన్ నటిస్తున్నారు. కాగా ఈరోజు ఆ సినిమాలో అనసూయ తన లుక్‌కు సంబందించిన ఓ పిక్ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఆ పిక్‌లో అనసూయ కాస్తా సీరియస్‌గా చూస్తూ.. ముక్కుకు పోగుతో అదరగొడుతోంది. ఈ సినిమాలో అనసూయ సామ్ పాత్రలో నటిస్తోంది. షమ్మీర్ సుల్తాన్ డైరెక్ట్ చేసిన.. ఈ. ‘మీకు మాత్రమే చెప్తా’ నవంబర్ 1న రిలీజ్ అయ్యేందుకు సిద్దం అవుతోంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa