ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇక అమెరికాలో “ప్రతిరోజు పండగే”.

cinema |  Suryaa Desk  | Published : Mon, Oct 14, 2019, 08:44 PM

భలే భలే మగాడివోయ్, మహానుభావుడు వంటి బంపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన మారుతి దర్శకుడిగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో,   బన్నీ వాస్ నిర్మాతగా  సుప్రీం హీరో సాయి తేజ్ హీరోగా  రూపొందిస్తున్న భారీ చిత్రం “ప్రతిరోజు పండగే”.   అందం అభినయంతో మెప్పిస్తున్న గ్లామర్ డాల్ రాశి ఖన్నా ఈ చిత్రంలో హీరోయిన్ గా న‌టిస్తోంది. క‌ట్ట‌ప్ప‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కి మరింత చేరువైన ప్ర‌ముఖ న‌టులు స‌త్య‌రాజ్ క్యారెక్ట‌ర్ ని ఈ సినిమా ద‌ర్శ‌కులు మారుతి ప్ర‌త్యేకంగా డిజైన్ చేశారు. అలానే ఈ సినిమాలో న‌టిస్తున్న మ‌రో న‌టుడు రావు ర‌మేశ్ పాత్ర కూడా హైలెట్ గా ఉండ‌నుంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్  సిటీలో జరుగుతోంది. ఆ తరువాత షెడ్యూల్ ని అమెరికాలో షూట్ చేయబోతున్నారు.  అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే కుటుంబ బంధాల్ని, విలువల్ని ఎమోషనల్ గా  చిత్రీక‌రిస్తున్న‌ట్టు తెలుస్తోంది. కాగా అక్టోబర్ 15న సాయి తేజ్ పుట్టినరోజు సందర్బంగా చిత్ర బృందం ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.  . మారుతి చిత్రాల్లో సహజంగా కనిపించే ఎంటర్ టైన్ మెంట్ ఇందులో రెండు రెట్లు ఎక్కువగానే ఉండబోతుంది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa