నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం ‘కె.ఎస్.రవికుమార్’ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మొదట ‘రూలర్’ అనే టైటిల్ అనుకున్నా ఆ తర్వాత ‘జడ్జిమెంట్’ అనే పేరు తెర మీదికి వచ్చింది. దీంతో అభిమానుల్లో కన్ఫ్యూజన్ మొదలైంది. కానీ ఈ గందరగోళాన్ని తొలగించేలా ఒక క్లారిటీ వచ్చింది. సినిమా ఫైనల్ టైటిల్ ‘రూలర్’ అని రూఢీ అయింది. చిత్ర శాటిలైట్ హక్కుల్ని కొన్న జెమినీ టీవీ ఈ విషయాన్ని తెలిపింది. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బాలయ్య, రవి కుమార్ కాంబినేషన్లో గత ఏడాది ‘జై సింహ’ అనే డీసెంట్ చిత్రం వచ్చి ఉండటంతో ఈ సినిమాపై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇందులో సొనాల్ చౌహాన్, వేదిక కథానాయికలుగా నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa