తెలుగు తెరపై అలనాటి అందాల చందమామగా జమునకి పేరు వుంది. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తనకి హెడ్ షేక్ రావడానికి గల కారణాన్ని గురించి ప్రస్తావించారు. "ఏవీఎమ్ నా మాతృ సంస్థ వంటిది. ఆ బ్యానర్లో నేను 14 సినిమాల వరకూ చేశాను. తెలుగులోని 'లేత మనసులు' సినిమాను తమిళంలో తీస్తున్నారు. ఆ రోజున 'అందాల ఓ చిలుక .. ' పాటను తమిళంలో చిత్రీకరిస్తున్నారు. హీరో జయశంకర్ .. హరనాథ్ మాదిరిగానే పొడగరి .. అంతకంటే బలంగా ఉండేవారు. ఈ పాటలో ఆయన 'గడ్డివాము' పై నుంచి జారుతూ వచ్చి నా ఒళ్లో వాలిపోవాలి. రిహార్సల్స్ సమయంలో బాగానే చేశారు. టేక్ చేసేటప్పుడు అయన నేరుగా వచ్చి నా తలపై పడ్డారు. ఆ సమయంలో తల చాలా నొప్పిగా అనిపించింది. కొంతకాలం తరువాత హెడ్ షేక్ కావడమనే సమస్య బయటపడింది" అని చెప్పుకొచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa