ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కీర్తి సురేష్ పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక కథనం

cinema |  Suryaa Desk  | Published : Thu, Oct 17, 2019, 02:33 PM

వంద సినిమాలు చేయలేదు. కానీ వందేళ్లు గుర్తుండిపోయే పాత్ర చేసింది. 'బాలనటి'గా ప్రశంసలు అందుకుని ఇప్పుడు 'మహానటి'గా ఎదిగి ''కీర్తి'' ప్రతిష్టలు సంపాదించుకుంది. తను చేసిన సినిమాలు ఒక పక్క. 'మహానటి' ఒక పక్క. అన్ని సినిమాలలో నటన ఒక ఎత్తైతే, ఈ ఒక్క సినిమాలో తన నటన మరో ఎత్తు. ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. చేసిన పాత్రలో ఒదిగిపోయింది. ప్రేక్షకులను నటనతో కట్టిపడేసింది. సౌత్ ఇండస్ట్రీని మొత్తం మైమరిపించింది. 'మహానటి సావిత్రి' జీవిత కథలో నటించి తను కూడా మహా''నటి'' అయింది. తన నటనతో సావిత్రినే మైపరిచింది ''కీర్తి సురేష్''. నేడు కీర్తి సురేష్ పుట్టిన రోజు సందర్భంగా  ప్రత్యేక కథనం.


తన చదువు, సినిమాను సమానంగా ముందుకు నడిపించింది. 1992 అక్టోబర్ 17 న జన్మించిన కీర్తి సురేష్ 8 ఏళ్ళ వయసులోనే బాలనటిగా సినీ ఇండస్ట్రీలో ప్రయాణం మొదలు పెట్టింది. అమ్మ తమిళ పరిశ్రమలో, నాన్న మలయాళ ఇండస్ట్రీలో మంచి పేరున్నవాళ్ళు. చెన్నైలో పుట్టిన కీర్తి చదువు కూడా అక్కడే మొదలైంది. మేనక(కీర్తి అమ్మ) మంచి నటి కావడంతో కీర్తి వాళ్ళ అమ్మ దగ్గర నుంచి చాల నేర్చుకుంది. నటిస్తూనే ఫాషన్ కాలేజీలో చేరి డిగ్రీ పూర్తి చేసింది.


చిన్నప్పుడే 'మమ్ముటి' వంటి స్టార్ హీరోతో పనిచేసింది. మొదటి సినిమాలో డ్యూయల్ రోల్, రెండవ సినిమాలో ''అంధురాలుగా'' పాత్రలు చేసింది. 2013 లో మలయాళం సినిమా ''గీతాంజలి'' సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. చదువుతూనే ఈ సినిమా చేసి మంచి పేరు తెచ్చుకుంది. 2016 లో తెలుగులో అడుగుపెట్టింది. రామ్ తో 'నేను శైలజ' చేసి అందరిని మెప్పించింది. తరువాత ''నేను లోకల్'' సినిమాలో నానితో నటించి మంచి మార్కులు కొట్టేసింది.


2018 కీర్తి సురేష్ నట జీవితాన్నే మార్చేసింది. మే 9 2018 ''మహానటి'' సినిమా ప్రేక్షకుల ముందరకు వచ్చింది. సినిమా ముందు అందరికి ఒకే ప్రశ్న. సావిత్రిలా కీర్తి నటించగలగదా, ఆ పాత్ర తను పోషించగలగదా ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ''కీర్తి'' తన నటనతో సమాధానం చెప్పింది. నట విశ్వరూపంచూపించింది. సావిత్రి లాగ నటన చేయగలవా అన్న వాళ్ళందరూ ఇప్పుడు సావిత్రిలా ఉన్నావ్ అంటున్నారంటే తను ఎంతలా జీవించిందో అర్థం అవుతుంది. తన నటనే సినిమాకు ప్రధాన బలం. సినిమా చూసాక అనిపిస్తుంది. ''మహానటి'' అంటే ''సావిత్రి'' ఖ్యాతిని పెంచిన ''కీర్తి''.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa