సుమంత్ మంచి నటుడు .. అయితే వరుస విజయాలను అందుకోవడంలో ఆయన విఫలమయ్యాడు. అయినా ఆయన తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే వస్తున్నాడు. తనలోని నటుడిని కొత్త కోణంలో ఆవిష్కరించడానికి ఆరాటపడుతూనే వున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన 'మళ్లీ రావా' అనే సినిమా చేశాడు. ఈ సినిమాలో ఆయన జోడీగా ఆకాంక్ష సింగ్ నటించింది. డిసెంబర్ 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
ఈ క్రమంలో ఈ సినిమా నుంచి థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. హీరో .. హీరోయిన్ల మధ్య స్కూల్ డేస్ నుంచే ప్రేమ మొదలైనట్టుగా చూపించారు. ఆ సమయంలోనే వాళ్లు దూరమైపోవడం .. ఆ తరువాత చాలాకాలానికి కలుసుకోవడం .. లవ్ .. బ్రేకప్ .. సెంటిమెంట్ .. ఎమోషన్స్ కి సంబంధించిన సన్నివేశాలపై ట్రైలర్ ను కట్ చేశారు. ట్రైలర్ తో మంచి ఫీల్ ను కలిగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఈ సినిమా అయినా సుమంత్ కి సక్సెస్ ను ఇస్తుందేమో చూడాలి మరి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa