2012లో బ్రిటీష్ సంగీత కళాకారుడు టేలర్‌ను వివాహం చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ రాధిక ఆప్టే ఈమధ్య తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. పెళ్లి తరువాత కూడా బాలీవుడ్‌తో పాటు సౌత్ సినిమాల్లో కూడా నటిస్తున్న ఈ బ్యూటీ పాత్ర డిమాండ్ చేస్తే న్యూడ్‌గా నటించేందుకు కూడా రెడీ అంటోంది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లతోనూ హల్‌చల్ చేస్తున్న ఈ బ్యూటీ సెలక్టివ్‌గా సినిమాలు చేస్తోందిప్పుడు. ఇంతకీ పెళ్లికి సంబంధించిన విషయానికొస్తే.... పెళ్లీ పీటలమీదకు చిరిగిన చీరతో వెళ్లిందట. పట్టు చీరతో తళతళలాడిపోవాల్సి ఉండగా.... చిరిగిన చీర కట్టు వెనక కథ విప్పుతూ అది తన అమ్మమ్మ చీర అని ఆమె జ్ఞాపకార్థమే ఆ చీరను కట్టుకున్నానని తెలిపింది. ఆ చీర చాలా చోట్ల చిరిగి ఉన్న అదే చీరతో తాను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నట్టుగా వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa