టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ అంటూ ప్రకంపనలు సృష్టించిన శ్రీరెడ్డి చెన్నైకి చెక్కేసినా సామాజిక మీడియాలో మాత్రం తన హవా కొనసాగిస్తునే ఉంది. ఎవరి గురించి ఎప్పుడు ఏది గుర్తొస్తే అది సోషల్ మీడియాలో తనదైన శైలిలో మాట్లాడుతూ పోస్టులు పెడుతుంది. ఒక్కోసారి ఈ పోస్టులు, మనం కనీసం రాసేందుకు కూడా కష్టమే. ఎందుకంటే ఆమె వాడే భాష అలాంటిది మరి. పవన్ అభిమానులకు, శ్రీరెడ్డికి మాటల యుద్దం సర్వసాధారణమైపోయింది.
ఇక ఈ మధ్య అమ్మడు ఓ రాజకీయనేతపై మనసు పారేసుకున్నట్టు చెప్పినా, మీరు రడీ అంటె పెళ్లాడతా మంటూ చాలా మంది చేస్తున్న కామెంట్లపై స్పందించిన శ్రీరెడ్డి పెళ్లి ప్రపోజల్స్ తీసుకొచ్చి మీ టైమ్ వేస్ట్ చేసుకోకండంటూ ఓ ఉచిత సలహా తనదైన తీరుగా ఇచ్చింది. అమ్మడు మాట్లాడిన భాష కాస్త ఘాటుగా ఉండటంతో వాటి వెనుక వున్న అర్థానికి నెటిజన్లు ఆశ్చర్యపోతునే తమదైన శైలిలో సెటైర్లేస్తున్నారు. ప్రపోజల్ వద్దు డైరెక్టుగా వచ్చేయమనా? అని నిలదీస్తున్నారు కొందరు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa