ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలయ్య మూవీ లేటెస్ట్ అప్డేట్...!

cinema |  Suryaa Desk  | Published : Wed, Oct 23, 2019, 07:39 PM

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో నటిస్తోన్న 105వ చిత్రం శరవేగంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ త్వరలో పూర్తి కానుంది. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో మంచి కామెడీ కూడా ఉంటుందట. ముఖ్యంగా సిట్యుయేషనల్ కామెడీ బాగా వచ్చిందని.. ఖచ్చితంగా ఈ సినిమా యాక్షన్ తో పాటు కామెడీతోనూ ఆకట్టుకుంటుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో చాలా మంది ప్రముఖ హాస్యనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ‘రూలర్’ అనే టైటిల్ నిర్ణయించినట్టు వార్తలు వచ్చాయి. `జైసింహా` వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌ర్వాత కె.ఎస్‌.రవికుమార్‌ – బాలయ్య హిట్ కాంబినేష‌న్‌ లో రూపొందుతోన్న ఈ సినిమాలో బాల‌కృష్ణ రెండు డిఫ‌రెంట్ లుక్స్‌లో క‌న‌ప‌డతారు. ఈ సినిమాలో సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌ గా నటిస్తున్నారు. ప్రకాశ్‌ రాజ్‌, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చిరంత‌న్ భ‌ట్‌ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి సి.రామ్‌ ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. హ్యాపీ మూవీస్‌ బ్యానర్‌ పై సి.కల్యాణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa