శబరిమలలో బుధవారం మకర జ్యోతి దర్శనం ఇవ్వనుంది. సా.6:25-6.55 గంటల మధ్య పొన్నాంబల కొండపై మకరజ్యోతి కనిపించనుంది. సాక్షాత్తు మణికంఠుడే ఈ జ్యోతిగా దర్శనమిస్తారని భక్తులు విశ్వసిస్తారు. జ్యోతి దర్శనం నేపథ్యంలో ఇప్పటికే దేవస్వం బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జనవరి 19 రాత్రి వరకు అయ్యప్ప దర్శనానికి అవకాశం ఉంది. అలాగే ఈ నెల 20వ తేదీన ఆలయం మూసివేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa