ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రత్యక్షం... జ్యోతిషం శాస్త్రం

Astrology |  Suryaa Desk  | Published : Wed, Jan 14, 2026, 10:46 AM

ప్రపంచం అంత దృగ్గణితమునే వాడుతోంది. దృక్ అనగా ప్రత్యక్షంగ కనపడాలి.ప్రత్యక్షం జ్యోతిషం శాస్త్రం  వచనం. అంటే అదే తీసుకువాలి.వరాహమిహిరుడు తన పంచసిద్ధాంతికలో  సూర్యసిద్ధాంతం గురించి పేర్కొన్నాడు. ఆ పేర్కొనది వరాహమిహిరుని సూర్యసిద్ధాంతం కాదు,పంచసిద్ధాంతికలోఒకటి. ఆ సూర్యసిద్ధాంతంలో చెప్పిన లెక్కలు  ప్రస్తుతం దొరికే సూర్య సిద్ధాంతం లో చెప్పే లెక్కలకి కొన్నితేడాలున్నాయి. వరాహమిహిరుడు కూడా ప్రత్యక్షంగా దర్శించి మకరము, ఉత్తరాయనము ఒకే సమయంలో వస్తున్నట్లు చెప్పడం జరిగింది ప్రత్యేకించి.సూర్యసిద్ధాంతం కూడ   ప్రస్తుతం దొరికే సూర్యసిద్ధాంతం ఒకలా, వరాహమిహిరది ఒకలా ఉంది. ఈ భేదం కాలాంతరం లో వచ్చింది. మేధావులు ప్రస్తుతం దొరికే సూర్యసిద్ధాంతం


12 వ శతబ్దంది గా లెక్కించారు. కాబట్టి మార్పులు సహజం. 


 భీష్మచార్యుని సమయం లో ఉత్తరాయణం రధసప్తమికి వచ్చింది. అందుకే ఆయన అష్టమికి మరణించాడు.కాబట్టి ఈ పద్దతి కాలంతరములో మార్పులు చెందుతుంది. అందుకని ప్రత్యక్షముగా ఉన్నదానికి సరిపడేట్లు, ఉండేట్లు ఎపటికప్పుడు సవరించుకువాలి. అలా సవరించుకోకుండా ఉండటం వల్లే పూర్వ పద్దతి కొనసాగుతోంది.


ఇక ఆలయాల్లో వాడేది పూర్వపద్దతి  అన్ని ఆలయాల్లో. అసలు ప్రధాన సమస్యే అది. జోతిష్యం రాని మిరాసిదారులు పూర్వ పద్దతి మాత్రమే పెట్టాలని పట్టుపట్టటం వల్ల, పూర్వ పద్దతి పంచాంగకర్తలని మాత్రమే పిలుస్తున్నారు దేవస్థానంవారు. దేవస్థానం దృగ్గణిత పద్దతి చేసేవారు కొందరు  దేవస్థానం ఆస్థాన పదవి కోసం పూర్వ పద్దతి ని ఆశ్రయించి వ్రాస్తున్నారు.కారణం దేవాలయాలు ఆచరిస్తున్నందువల్ల ఇది ఎక్కువ ప్రచారంలోకి


 వెడుతోంది పూర్వపద్దతి.కారణం తిరుమల తిరుపతి దేవస్థానంవారు ఉచితపంచాంగములు ఇస్తారు. కాబట్టి ఎక్కువ ప్రచారం లోకి వెడుతుంది. కాబట్టి ఎక్కువ ప్రచారంలోకి వెళ్ళటానికి కారణాలు వేరువేరు.దేవాలయాల ఆచరించటానికి పద్దతి అది. వాళ్ళు ఆచరిస్తున్నారని మనం దృక్ గణితన్ని వదిలేయగోడదు.పూర్వ పద్దతి వాడే వారు అన్ని చోట్ల ఉన్నారు. అయితే అది వర్తమానకాలానికి సరిపోయేట్లుగా మార్చుకోవలసిన అవసరం ఉంది. అలా మార్చుకోమని  సూర్యసిద్ధాంతమే చెపుతోంది.


ఉత్తర భారత దేశంలోకూడ ఆలయాలు 


పూర్వ పద్దతినే వాడుతున్నారు. కాని దృక్ తుల్య గ్రహాలనే స్వీకరించాలి అని ఉన్నందున 


దృక్ తుల్యముగా పరీక్షించుకోవాలి,


పరిశీలించుకోవాలి కనపడేట్లుగా.


ప్రపంచ దేశాలు అన్నీ కూడా దృక్ పంచాంగాన్ని ప్రధానంగా తీసుకొని ముందుకు 


వెడుతున్నాయి. భారతదేశం మాత్రం పూర్వ పద్ధతిని అనుసరిస్తూనే వర్తమానానికి తగినట్లు ఎప్పటికప్పుడు సంస్కారాలు చేసుకుంటూ దృగ్గణిత తుల్యం చేసుకుంటూ వస్తోంది.  పంచాంగ గణితాలను కొంతమంది కలియుగా దిగాను, కొందరు శకాది గాను మరి కొంతమంది వాక్య పంచాంగము  ప్రకారము లెక్కించే వివిధ పద్ధతులున్నాయి. గ్రహణాలు విషయములో కూడా  అందరూ దృక్ పంచాంగాన్ని అనుసరించే ముందుకు వెళతారు.


సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మార్పునే సంక్రమణం అంటాం. మార్పుల ఆధారంగానే ఉత్తరాయణం దక్షిణాయనం ఏర్పడుతున్నాయి.సూర్యుడు 12 రాశులలోను అనగా ఒక రాశి నుండీ మరొక రాశిలోకి ప్రతినెల దాదాపు 13 నుంచి 17వ తారీకు మధ్య మారడం జరుగుతుంది. వాటినే రవి సంక్రమణముగా పిలుస్తారు, అవే సూర్య సంక్రాంతిగా పరిగణిస్తాం.


సాధారణంగా పండుగలన్నీ చాంద్రమానాన్ని ఆధారం చేసుకుని వెళతాయి, అయితే ముక్కోటి ఏకాదశి, మకర సంక్రాంతి మొదలైనవి సూర్యమానాన్ని ఆధారం చేసుకుంటాయి. అనగా  సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి గా పరిగణిస్తాం. 


సూర్యుడు వృశ్చిక రాశి నుండి ధనుస్సు రాశిలో ప్రవేశించిన రోజు, ధనుర్మాసం ప్రారంభం. ధనుర్మాసాన్ని గమనించినట్లయితే (దాన్నే నెలపట్టు అంటాం), మాసమంతా గోదాదేవి  హరిని ధ్యానిస్తూ పాశురాలు వల్లిస్తూ, పూజిస్తూ చివరి రోజున గోదా కళ్యాణం, అదే భోగి.


ఈ సంవత్సరం మకర సంక్రాంతి 14 జనవరి మధ్యాహ్నం (అపరాహ్నసమయం ) 3.07 నిమిషాలకి  సూర్య భగవానుడు మకర రాశిలో  దృగ్గణిత పంచాంగం ఆధారంగా  ప్రవేశం కనుక అక్కడి నుంచి మకర సంక్రాంతి పుణ్యకాలంగా (దాదాపు రెండు గంటలు కాలం), ఎప్పుడు  ప్రారంభం అయ్యిందో దానికి దగ్గరగా  ఉండే సమయమే ఎక్కువ పుణ్యకాలం.  అందుకని పగలుకనుక సూర్యాస్తమయం లోపల జరిగితే  పగటి వేళ పుణ్యకాలం  అనేటువంటి విషయం ధర్మశాస్త్రంలో వ్రాసి ఉంది.జనవరి 14న మకర సంక్రాంతిగా ప్రపంచ దేశాలన్నీ ప్రధానంగా తీసుకునే దృక్ పంచాంగం అనుసరించి వెళ్లడం మేలు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa