ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"బొంబాట్" సినిమా టైటిల్ లోగో విడుదల ..

cinema |  Suryaa Desk  | Published : Sun, Oct 27, 2019, 11:18 AM

రాఘ‌వేంద్ర వర్మ దర్శకత్వంలో 'ఈ న‌గ‌రానికి ఏమైంది' ఫేమ్ సుశాంత్,  సిమ్రాన్, చాందిని హీరో హీరోయిన్స్‌ తెరకెక్కిన చిత్రం 'బొంబాట్'. ఈ సినిమాను ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు స‌మ‌ర్ప‌ణ‌లో సుచేత డ్రీమ్ వర్క్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై విశ్వాస్ హ‌నూర్‌క‌ర్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ లోగోను డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గన్నాథ్ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా పూరి జ‌గ‌న్నాథ్ మాట్లాడుతూ... యంగ్‌ బ్లడ్‌ అందరూ కలిసి ఈ సినిమాను చేసారని, బొంబాట్‌ ఫస్ట్‌ లుక్‌ విడుదల చేయడం ఆనందంగా ఉందని అన్నారు. జోశ్యభట్ల మంచి స్నేహితుడని, ఈ సినిమా కలెక్షన్స్‌తో "బొంబాట్‌" చేయాలని కోరుకుంటున్నానని పురీ  తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa