ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తమిళం లో ‘బ్రహ్మోత్సవం’ మూవీ రిలీజ్..

cinema |  Suryaa Desk  | Published : Mon, Dec 04, 2017, 12:13 PM

మహేష్ బాబు కెరియర్ లో భారీ డిజాస్టర్ గా నిలిచిన ‘బ్రహ్మోత్సవం’ సినిమా ఇప్పుడు తమిళం లో రిలీజ్ కు సిద్ధం అవుతుంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం లో పివిపి బ్యానర్ లో 2016 లో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను అలరించడం లో విఫలం అయ్యింది. అయితే ఈ చిత్రాన్ని ఇప్పుడు ‘అనిరుద్’ పేరుతో తమిళం లో రిలీజ్ చేయబోతున్నారు.ప్రస్తుతం డబ్బింగ్ కు సంబందించిన పనులు జరుగుతుండగా , రిలీజ్ డేట్ ను ఇంకా చిత్ర యూనిట్ ప్రకటించలేదు. స్పైడర్ మూవీ తో తమిళ ప్రేక్షకులను అలరించిన మహేష్ , ఇప్పుడు అనిరుద్ తో ఎలా అలరిస్తాడో , తెలుగు లో ప్లాప్ కాగా , తమిళం లో ఎలాంటి ఫలితం దక్కించుకుంటుందో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa