కథాకథనాలపై రవిబాబుకి మంచి పట్టుంది. ఆయన టేకింగ్ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఆయన తాజా చిత్రంగా వచ్చేనెల 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఆవిరి' సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో రవిబాబు మాట్లాడుతూ .. 'ఆవిరి' హారర్ సినిమా అని చెప్పలేం .. ఫ్యామిలీ థ్రిల్లర్ అంటే కరెక్ట్ గా ఉంటుంది. ఈ సినిమాలో కీలకమైన పాత్ర నేనే చేయాలని ముందుగా అనుకోలేదు. వేరే ఎవరినైనా తీసుకుందామని ట్రై చేసినా కుదరలేదు. 'ఈ పాత్రను నువ్వు చేస్తేనే బాగుంటుందేమో' అని రైటర్ సత్యానంద్ గారు అంటే, అప్పుడు ఆ పాత్రను చేశాను. దిల్ రాజుగారితో మంచి పరిచయం వుంది. కలిసి సినిమా చేద్దామనే ఆలోచన ఉన్నప్పటికీ ఇంతవరకూ కుదరలేదు. ఈ సినిమాను ఆయన రిలీజ్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా వుంది" అని చెప్పుకొచ్చాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa