విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం వెంకీ మామ సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది. ప్రమోషన్ లో బిజీగా ఉంది. మామ అల్లుళ్లు నటించిన ఈ సినిమాలో.. రాశి ఖన్నా , పాయల్ రాజ పుత్ నటిస్తున్నారు. ఈ సినిమా తరువాత వెంకటేశ్ 'అసురన్' రీమేక్ లో చేయనున్నాడు. తమిళంలో ధనుశ్ చేసిన ఈ సినిమా దసరాకి విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇది వెంకటేశ్ కి 74వ సినిమా అనీ, సురేశ్ ప్రొడక్షన్స్ లో నిర్మితమవుతుందని సురేశ్ బాబు చెప్పారు.
ఇకపోతే వెంకటేశ్ 75వ సినిమా ఏ దర్శకుడితో వుండనుందనే విషయాన్ని తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో వెంకటేశ్ తో ఒక సినిమా చేయనున్నట్టుగా తరుణ్ భాస్కర్ చెప్పాడు. కానీ వెంకటేశ్ 75వ సినిమా దర్శకుడిగా తాజాగా త్రివిక్రమ్ పేరు తెరపైకి వచ్చింది. ఆయనే ఈ సినిమాకి దర్శకుడనే మాట ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. త్వరలోనే ఈ విషయంలో స్పష్టత రానుంది. వెంకీ మామ సినిమా త్వరలోనే థియేటర్లలో సందడి చేయబోతుంది..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa