ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిగ్ బాస్ అర్చన పెళ్లి డేట్ ఫిక్స్..

cinema |  Suryaa Desk  | Published : Wed, Oct 30, 2019, 10:25 PM

తెలుగు బిగ్ బాస్ 1 సీజన్లో కంటెస్టెంటుగా పార్టిసిపేట్ చేసిన అర్చన.. గుర్తే ఉంటుంది.. ఎన్నో తెలుగు సినిమాలలో నటిస్తూ వచ్చింది. ఏ సినిమా కూడా ఆమె అనుకున్న ఫలితాలను ఇవ్వలేక పోవడంతో సినిమాలకు దూరంగా ఉండనే సంగతి తెలిసిందే.. అయితే ఈమె ఎప్పటి నుండో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.. ఇకపోతే తాజాగా ఈమె నిశ్చితార్థం చేసుకుంది. ఆ వేడుకకు బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరు వచ్చి సందడి చేశారు.
అయితే వచ్చే నెల అంటే నవంబర్ 13 న వీరి వివాహం జరగనుందని సమాచారం. ఈ వేడుకకు బంధుమిత్రులు సహా పలువురు సినీసెలబ్రిటీలు హాజరు కానున్నారు. ఆ మేరకు తాజాగా మీడియాకు సమాచారం అందింది.అల్లరి నరేష్ సరసన `నేను` అనే చిత్రంతో కథానాయికగా తెరకు పరిచయం అయిన అర్చన చక్కని క్లాసికల్ డ్యాన్సర్. `యమదొంగ` చిత్రంలో ఓ పాటలో మెరిసింది. యంగ్ టైగర్ హోస్టింగ్ చేసిన బిగ్ బాస్ తెలుగు సీజన్ లో పాల్గొంది. ఇప్పుడు ఓ ఇంటిది కాబోతుంది.. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa