ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'మీకు మాత్రమే చెప్తా' మూవీ రివ్యూ

cinema |  Suryaa Desk  | Published : Fri, Nov 01, 2019, 02:05 PM

టాలెంట్ దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా, సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా తెరకెక్కిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ మీకు మాత్రమే చెప్తా. క్రేజీ కాంబో కావడంతో పాటు, మూవీ ట్రైలర్, టీజర్ మూవీపై మంచి అంచనాలను క్రియేట్ చేసింది. మరి మీకు మాత్రమే చెప్తా ఏమాత్రం ప్రేక్షకుల అంచనాలు అందుకుందో సమీక్షలో చూద్దాం.


కథ:


రాకేష్ (తరుణ్ భాస్కర్)ఒక టీవీ ఛానెల్ లో యాంకర్ గా పని చేస్తుంటాడు. డాక్టర్ అయిన స్టెఫీ(వాణి భోజన్) ప్రేమలో పడిన రాకేష్ ఆమెకు సిగరెట్, మందు తాగడం వంటి విషయాలలో కొన్ని అబద్దాలు చెవుతాడు. ఇంకా రెండు రోజులలో స్టెఫీ తో పెళ్లనగా రాకేష్ ఒక అమ్మాయితో గదిలో ఉన్న వీడియో బయటకి వస్తుంది. దీనితో రాకేష్ తన మిత్రుడు అభినవ్ గోమటమ్ సహాయతో ఆ వీడియో ని సైట్ నుండి డిలీట్ చేసేలా ప్రయత్నాలు మొదలుపెడతాడు. మరి ఆ వీడియో స్టెఫీ కీ కనిపించకుండా చేయగలిగారా? ఆ వీడియో గురించిన నిజం స్టెఫీ తెలుసుకుందా? అసలు ఆ వీడియోలో రాకేష్ ఎందుకు ఉన్నాడు? రాకేష్, స్టెఫీ కథ ఎలా ముగిసింది? అనేది మిగతా కథ.


ప్లస్ పాయింట్స్:


మొదటి చిత్రం పెళ్లి చూపులు తో జాతీయ అవార్డు గెలుచుకొని టాలెంట్ దర్శకుడిగా పేరుతెచ్చుకున్న తరుణ్ భాస్కర్ హీరో గా మొదటి చిత్రం తో మెప్పించాడు. తన గర్ల్ ఫ్రెండ్ కి నిజం ఎక్కడ తెలిసిపోతుందో అని ప్రతి క్షణం భయపడే ఫ్రస్ట్రేటెడ్ గయ్ గా ఆయన నటన సహజత్వానికి దగ్గరగా ఉంది. ఇక తరుణ్ ఫ్రెండ్ పాత్ర చేసిన అభినవ్ హీరో తో సమానంగా స్క్రీన్ స్పేస్ పంచుకున్నారు. మిత్రుడి టెన్షన్ ని పంచు కుంటూ, అక్కడడక్కడా ఫున్నింగ్ పంచెస్ తో తన రోల్ కు ఆయన పూర్తి న్యాయం చేశారు. అబద్దాలు నచ్చని…, రాకేష్ చర్యలను అనుమానించే అమ్మాయి పాత్రలో వాణి భోజన్ చక్కగా సరిపోయింది. అనసూయ, అవంతిక మిశ్రా, పావని గంగిరెడ్డి తక్కువ నిడివి గల పాత్రలో పరవాలేదనిపించారు.


మైనస్ పాయింట్స్:


యూత్ కు కనెక్ట్ అయ్యే ఓ కాంటెంపరరీ కాన్సెప్ట్ ని ఎంచుకున్న దర్శకుడు, ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో తడబడ్డాడు.ఒక చిన్న పాయింట్ ని కథావస్తువుగా తీసుకున్న ఆయన రిపీటెడ్ సన్నివేశాలతో నిరాశ కలిగించారు. ఇలాంటి ట్రిక్కీ ప్లే తెరపై పేలాలంటే ఆద్యంతం అలరించే పంచ్ లతో సాగాలి. కాని అక్కడక్కడ తప్ప తరుణ్ భాస్కర్, అభినవ్ పంచులు ప్రేక్షకులకు నవ్వు తెప్పించలేకపోయాయి. సహజత్వానికి దగ్గరగా కమర్షియల్ ఎలిమెంట్స్ లేని ఈ మూవీ క్లాస్ సి మరియు బి ప్రేక్షకులకు అంతగా చేరకపోవచ్చు. నిర్మాణ విలువలు కూడా ఏమంత రిచ్ గా ఉండవు. దేవరకొండ లాంటి నిర్మాత ఉన్నప్పుడు ఇలాంటి తక్కువ క్వాలిటీ ఉన్న సినిమాను ఉహించము. అనసూయ లాంటి యాక్టర్ ని ప్రాధాన్యం లేని రెండు మూడు సన్నివేశాలకు పరిమితం చేశారు.ఇక ఈ మూవీ లో చేసిన ఒక్క యాక్టర్ కూడా తెలిసినవారు కాకపోవడం మరో మైనస్ గా చెప్పవచ్చు.


సాంకేతిక విభాగం:


దర్శకుడు మొబైల్ వలన వ్యక్తి ప్రైవసీ కి ఏవిధంగా భంగం కలుగుతుంది అనే విషయాన్నీ ఒక జంట ప్రేమ, పెళ్లికి ముడిపెట్టి ఫన్నీ గా నడపాలని భావించారు.ఐతే ఆ క్రమంలో ఆయన రాసుకున్న సన్నివేశాలు, స్క్రీన్ ప్లే రొటీన్ గా అనాసక్తిగా సాగింది. ఒక చిన్న పాయింట్ చుట్టూ రెండు గంటల కథ నడిపే క్రమంలో ఆయన ఎంచుకున్న విధానం, రాసుకున్న పంచ్ లు పేలి ఉంటే ఇంకా మూవీ మరో లెవెల్ లో ఉండేది. కథలో భాగంగా శివ స్వరపరిచిన రెండు పాటలు పర్వాలేదు, బీజీఎమ్ అంత ఆసక్తిగా ఏమిలేదు.


సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదని పించాయి.


తీర్పు:


ఈ సినిమా సింపుల్ స్టోరీతో సందర్భోచితంగా సాగే పక్కా కామెడీ ఎంటర్ టైనర్. సినిమాలో తరుణ్, అభినవ్ మధ్య నడిచే సీన్స్ అలాగే వీడియోకి సంబంధించిన కొన్ని ఎపిసోడ్లు బాగా నవ్విస్తాయి. అయితే కథనం ఆకట్టుకోలేకపోవడం మరియు కథ సింపుల్ గా ఉండటం, కొని సన్నివేశాలు ఇంట్రస్ట్ గా సాగకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి. ఓవరాల్ గా ఈ సినిమా ఒకసారి సరదగా చూడొచ్చు.


నటీనటులు : తరుణ్ భాస్కర్, అనసూయ భరద్వాజ్, అభినవ్ గోమాతం, వాణి భోజన్, అవంతిక మిశ్రా


దర్శకత్వం : షమీర్ సుల్తాన్


నిర్మాత‌లు : విజయ్ దేవరకొండ, వర్ధన్ దేవరకొండ


సంగీతం : శివకుమార్


సినిమాటోగ్రఫర్ : మాథన్ గుణదేవ


ఎడిటర్ : శ్రీజిత్ సారంగ్


మూవీ రేటింగ్ :3.5/5. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa