బాలకృష్ణ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాలలో 'నరసింహనాయుడు' ఒకటి. బి.గోపాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, 2001లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ వసూళ్లను సాధించిన బాలకృష్ణ సినిమాలలో ఒకటిగా నిలిచింది. మ్యూజికల్ హిట్ గాను మంచి మార్కులు కొట్టేసిన ఈ సినిమాకి, సీక్వెల్ చేయడానికి బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం.
'నరసింహనాయుడు' సినిమాకి కథను అందించిన చిన్నికృష్ణ .. ఈ సినిమా సీక్వెల్ కి కథ రాసుకుని వెళ్లి రీసెంట్ గా బాలకృష్ణకి వినిపించాడట. ఈ కథ బాగా నచ్చడంతో, చేద్దామని బాలకృష్ణ అంగీకారాన్ని తెలిపినట్టుగా చెబుతున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటన వెలువడనుందని అంటున్నారు. బాలకృష్ణ వరుసగా సినిమాలను ఒప్పేసుకుంటూ వెళుతున్నారు. ఈ క్రమంలో ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి మరి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa