ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రజనీకాంత్‌ 'దర్పార్‌' మూవీ సాంగ్ దుమ్ములేపుతుంది!

cinema |  Suryaa Desk  | Published : Sun, Dec 01, 2019, 03:57 PM

రజనీకాంత్‌ హీరోగా మురగదాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'దర్పార్‌'. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎ.సుభాస్కరన్‌ నిర్మిస్తున్నారు. సంక్రాంతికి విడుదలవుతున్న ఈ చిత్రం తొలి పాట దుమ్ము ధూలి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రజనీకాంత్‌ ఇమేజ్‌కి తగినట్టుగా సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచంద్రన్‌ స్వరపరిచిన పాటకి అనంత శ్రీరామ్‌ సాహిత్యాన్ని అందించారు. ఈ పాట ఇంటర్‌నెట్‌లో సందడి చేస్తోందని ఇప్పటికే తెలుగు, తమిళ్‌లో ఎనిమిది మిలియన్‌ వ్యూస్‌ వచ్చాయి. ఈ సందర్భంగా అనంత శ్రీరామ్‌ స్పందిస్తూ "సంతోషంలో, ఆనంద పారవశ్యంలో ఉన్న సమయమిది. తెలుగులో రెండు మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి. రజనీకాంత్‌ సినిమా అంటే మొదటిపాటకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ పాట రాసే అదృష్టం ఇంతకుముందు పేట చిత్రంలో, ఇప్పుడు ఈ దర్‌ా సినిమాలో వచ్చిందని" అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa