ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దబాంగ్‌-3 స్పెషల్‌ సాంగ్‌ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Sun, Dec 01, 2019, 09:26 PM

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం 'దబాంగ్ 3'. ప్రభుదేవా దర్శకత్వం వహించారు. సోనాక్షి సిన్హా కథానాయిక. క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని డిసెంబర్‌ 20న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా ప్రచారంలో భాగంగా 'మున్నా బద్మాన్‌ హువా' అంటూ సాగే ఓ స్పెషల్‌ సాంగ్‌ను చిత్రబృందం ఆదివారం విడుదల చేసింది. ఈ పాట విడుదల సందర్భంగా ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. అనంతరం ఈ వీడియో సాంగ్‌ను సోషల్‌మీడియా వేదికగా సల్మాన్‌ అభిమానులతో పంచుకున్నారు. నటి వరీనా హుస్సేన్‌ ఈ పాటలో సల్మాన్‌తో ఆడిపాడారు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన 'హుద్‌ హుద్‌ దబాంగ్‌' పాట విషయంలో సోషల్‌మీడియా వేదికగా నెటిజన్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇందులో పలువురు కాషాయ వస్త్రాలు ధరించి డ్యాన్స్‌ కనిపించారు. దీంతో ఈ పాట పట్ల ఓ హిందూ సంస్థ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa