తెలుగు .. తమిళ భాషల్లో అంజలికి మంచి క్రేజ్ వుంది. అందుకు కారణం ఆమె గ్లామర్ కంటే .. నటనే కారణమని చెప్పొచ్చు. ఇక రాయ్ లక్ష్మీకి కూడా ఈ రెండు భాషల్లోను మంచి క్రేజ్ వుంది. మొదటి నుంచి కూడా గ్లామర్ పరంగానే ఆమె ఎక్కువ మార్కులు కొల్లగొట్టేసింది. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా చేయడానికి ఇప్పుడు సన్నాహాలు జరుగుతున్నాయి.
'గుంటూరు టాకీస్' .. 'రాజా మీరు కేక' సినిమాలను నిర్మించిన రాజ్ కుమార్, ఈ సినిమాను నిర్మించనుండగా .. కర్రి బాలాజీ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయనీ, ఉత్కంఠ భరితమైన కథా కథనాలతో ఈ సినిమా తెరకెక్కనుందని దర్శక నిర్మాతలు చెప్పారు. కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాకి, మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారని చెప్పుకొచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa