ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్ ఆర్ ఆర్' పై మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Tue, Dec 03, 2019, 09:15 PM

రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ ఆర్ ఆర్' షూటింగ్ చకచకా జరిగిపోతోంది. ఎన్టీఆర్ .. చరణ్ కథానాయకులుగా నటిస్తున్న ఈ సినిమా ఇంతవరకూ 70 శాతం చిత్రీకరణను జరుపుకుంది. కొమరం భీమ్ గా ఎన్టీఆర్ .. అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటిస్తున్నారు. చరణ్ జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటించింది. రీ సెంట్ గా ఆమె పోర్షన్ పూర్తికావడంతో తిరిగి వెళ్లిపోయింది. ఈ సినిమాలో ఆమె తెరపై కనిపించేది 15 నిమిషాలు మాత్రమేనని చెబుతున్నారు.
ఇక తన హీరోయిన్స్ తో ఎన్టీఆర్ రొమాంటిక్ సీన్స్ కాస్త ఎక్కువగానే ఉంటాయట. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం ఆ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందని అంటున్నారు. ముందుగా ఈ సినిమాను వచ్చే ఏడాది జూలై 30న విడుదల చేయాలనుకున్నారు. కానీ అక్టోబర్ 2వ తేదీన విడుదల చేసే ఆలోచనలో ఉన్నారనేది తాజా సమాచారం. తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీతో కలుపుకుని 10 భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa