శేఖర్ కమ్ముల దర్శకత్వంలో హీరోగా నాగచైతన్య నటిస్తున్నా సినిమా 'లవ్ స్టోరీ'. ఈ 'లవ్‌స్టోరీ' సినిమా నాగచైతన్య పాత్ర తెలంగాణ యాస మాట్లాడుతుంది. ఈ మూవీలో సాయిపల్లవి హీరోయిన్. నారాయణ్‌దాస్ కె. నారంగ్, పి. రామ్మోహనరావు నిర్మిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తయింది. మలి షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ 'లవ్‌స్టోరీ' విడుదలకు డేట్ లాక్ చేశారని సమాచారం. ఏప్రిల్ 2న ఈ సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారట. ఉన్నత స్థాయికి ఎదగాలనే పట్టుదలతో ఓ మారుమూల గ్రామం నుంచి హైదరాబాద్ వచ్చే యువకుడిగా నాగచైతన్య, కలను నిజం చేసుకోవాలనుకునే తపనతో తన ఊరి నుంచి హైదరాబాద్ చేరుకునే యువతిగా సాయిపల్లవి నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa