ఉల్లాసంగా ఉత్సాహంగా మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భామ స్నేహా ఉల్లాల్.. మొదట్లో బాగానే అవకాశాలు దక్కించుకున్నా.. ఆ తర్వాత ఛాన్సులు తగ్గిపోయాయి. జూనియర్ ఐశ్వర్యారాయ్ అనే ట్యాగ్ కొన్నాళ్లు మాత్రమే ఈమెకు ఉపయోగపడింది. గత రెండేళ్లుగా ఈమె సినిమాలే చేయలేదు. కానీ ఇప్పుడు ఆయుష్మాన్ భవ అంటూ తెలుగులో రీఎంట్రీ ఇవ్వబోతోంది స్నేహా ఉల్లాల్. ఇవాళ ఈ భామ పుట్టిన రోజు సందర్భంగా.. ఓ అదిరిపోయే పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఆయుష్మాన్ భవ చిత్రంలో వైశాలి అనే పాత్రలో స్నేహ కనిపించబోతోంది. పేరు బాగా ట్రెడినషల్ గా ఉంది కదా అని.. కేరక్టర్ కూడా అలాంటిదే అనుకునే అవకాశం ఉంది. అందుకే ఈ విషయంపై పోస్టర్ లోనే ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. 'ఏంటీ.. వైశాలి అంటే ట్రెడిషనల్ అనుకున్నారా.. పిచ్చ పోష్.. ఫిగర్ అదిరిపోద్ది' అంటూ చెప్పేశారు.
మేకర్స్ చెప్పడం అని కాదు కానీ.. ఓ కాస్ట్లీ బైక్ పక్కన డెనిమ్ వేర్ లో.. బ్లూ కలర్ స్పెక్టకిల్స్ తో కనిపిస్తున్న స్నేహా ఉల్లాల్ ను చూస్తే.. నిజంగానే పిచ్చ పోష్ అనిపించకమానదు. ఈ మధ్య ఫిగర్ పై కూడా బాగా దృష్టి పెట్టిందేమో.. అమ్మడి కటౌట్ లో చాలానే ఛేంజెస్ కనిపిస్తున్నాయి. సెక్సీ లుక్స్ లో స్నేహా ఉల్లాల్ తెగ అలరించేస్తోంది. కాని ఇవన్నీ సినిమా ఇండస్ర్టీలో అమ్మడికి సక్సెస్ ను ఇస్తే బాగుండు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa