ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీజర్ ను విడుదల చేసిన 7 నిమిషాల్లోనే 1 మిలియన్ వ్యూస్

cinema |  Suryaa Desk  | Published : Wed, Dec 11, 2019, 08:14 PM

అల వైకుంఠపురములో' సినిమా నుంచి ఒక టీజర్ ను రిలీజ్ చేశారు. ప్రధాన పాత్రధారులందరినీ కవర్ చేస్తూ కట్ చేసిన ఈ టీజర్, సినిమాపై ఆసక్తిని పెంచేదిలా వుంది. యూ ట్యూబ్ లో ఈ టీజర్ ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. టీజర్ ను విడుదల చేసిన 7 నిమిషాల్లోనే 1 మిలియన్ వ్యూస్ ను రాబట్టింది. అత్యంత వేగంగా ఈ స్థాయి వ్యూస్ ను సాధించిన టీజర్ గా నిలిచింది. ఇటీవల 'సరిలేరు నీకెవ్వరు' నుంచి టీజర్ ను రిలీజ్ చేయగా 9 నిమిషాల్లో 1 మిలియన్ వ్యూస్ మార్కును అందుకుంది. అంతకంటే వేగంగా 1 మిలియన్ వ్యూస్ ను రాబట్టినదిగా 'అల వైకుంఠపురములో' టీజర్ కొత్త రికార్డును నమోదు చేసింది. ఈ మూవీని త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో అల్లు అర్జున్..పూజాహెగ్డే జంటగా నటిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa