తమిళ సినిమాలపై దృష్టి పెట్టింది నటి దివ్యాన్ష కౌశిక్. అక్కడికి వెళ్లి చేసిన ప్రయత్నాల కారణంగానే ఆమెకి ‘టక్కర్’ సినిమాలో ఛాన్స్ తగిలింది. సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై ఆమె చాలానే ఆశలు పెట్టుకుంది. అంతేకాదు కోలీవుడ్ లో తాను నిలదొక్కుకుంటాననే ఆశతో ఉందట ఈ బ్యూటీ. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా హిట్ అయితే ఈ రెండు భాషల నుంచి ఆమెకి ఆఫర్లు పెరిగే అవకాశాలైతే వున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa