యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న `జిల్` చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తోన్న పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో 'జాన్' మూవీ అన్ని విషయం తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమా గురించి లేటెస్ట్ గా షూటింగ్ అప్ డేట్ తెలిసింది. జనవరి 2న నుండి ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్ లో జరగనుంది. కాగా ఈ చిత్రంలో పూజా హెగ్డే పాత్ర ఓ స్కూల్ టీచర్ గా కనిపించనుందని.. ఈ సినిమా పీరియాడిక్ మూవీ కావడంతో పూజా గెటప్ కూడా ఆనాటి ట్రెడిషనల్ లేడీ టీచర్స్ పోలి ఉండేలా డిజైన్ చేస్తున్నారని తెలుస్తోంది. మూడు భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్నీ గోపికృష్ణ మూవీస్ , యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2020 చివర్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. ప్రస్తుతానికి అయితే ఈ సినిమాకి టైటిల్ ‘జాన్’ ప్రచారంలో ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa