వెంకటేష్, నాగ చైతన్యలు కలిసి బాబీ డైరెక్షన్లో చేసిన చిత్రం ‘వెంకీ మామ’. ఈ సినిమా కి మంచి టాక్ వచ్చింది . అయితే గీతా గోవిందం చిత్రంతో హిట్ డైరెక్టర్స్ లిస్ట్‌లో చేరిన పరశురాం తన తదుపరి సినిమా కోసం చాలా సమయం తీసుకున్నాడు. ఆ మధ్య మహేష్, అల్లు అర్జున్, అఖిల్‌లలో ఒకరితో పరశురాం సినిమా ఉంటుందని జోరుగా ప్రచారం జరిగింది. కాని ఆ ప్రచారాలని తలకిందులు చేస్తూ అక్కినేని హీరో నాగచైతన్యతో సినిమా చేయబోతున్నాడు. 14రీల్స్ నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్‌పై అఫీషియల్ ప్రకటన ఇచ్చింది చిత్ర నిర్మాణ సంస్థ. మరి కొద్ది రోజులలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళనుంది. నాగ చైతన్య రీసెంట్‌గా వెంకీ మామ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. లవర్స్ అనే పేరుతో ఈ సినిమా ప్రచారం జరుపుకుంటుంది. కాగా, పరశురాం దర్శకత్వంలో తెరకెక్కనున్న నాగచైతన్య 20వ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa