రాంగోపాల్ వర్మ తాజాగా రూపొందించిన చిత్రం 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అనేక అవాంతరాల అనంతరం ఈ సినిమా డిసెంబరు 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో వర్మపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జనసేన యూత్ కోడూరుపేట పేరిట కొంతమంది.. వర్మకు శ్రద్ధాంజలి తెలుపుతూ.. బ్యానర్ ఏర్పాటు చేశారు. అన్‌పార్లమెంటరీ పదాలు వాడుతూ.. ఈనెల 26న వర్మ పెద్దకర్మ చేస్తున్నామంటూ బ్యానర్‌లో పేర్కొన్నారు. ఇక ఇందుకు సంబంధించిన ఫొటోను ట్విటర్‌లో షేర్ చేసిన వర్మ... ' మీ లీడరును దెయ్యమై పట్టుకోవడానికి అతి త్వరలో వస్తున్నా' అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. 'పీకే, సీబీఎన్, లోకేశ్ మద్దతుదారులు.. నా వ్యతిరేకులు. అమ్మ రాజ్యంలో సినిమాను అర్థం చేసుకోండి. ఇది కేవలం వినోదం కోసం చేసినదే. నిజానికి నేను పీకే, సీబీఎన్, లోకేశ్‌ను ఎంతగానో ప్రేమిస్తాను. వారి అనుచరులందరూ ముఖ్యంగా కోడూరుపాడు జనసేన కార్యకర్తలపై ఒట్టేసి ఈ విషయం చెబుతున్నా' అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.
For all pro pk ,pro cbn ,pro lokesh and anti me ,who are bad mouthing AMMA RAJYAMLO please understand that film is just made for fun and in reality I luv Pk, Cbn and Lokesh and I god promise on their followers and especially on Jana Sena followers from KODOORUPAADU pic.twitter.com/qGwPuyMAOK
— Ram Gopal Varma (@RGVzoomin) December 14, 2019
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa