వెంకటేష్, నాగ చైతన్యలు కలిసి బాబీ డైరెక్షన్లో చేసిన చిత్రం ‘వెంకీ మామ’. ఈ సినిమా నిన్న విడుదలై పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ ను సాధిస్తోంది. విలేజ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం పాజటివ్ టాక్ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ట్విటర్ ద్వారా చిత్రబృందాన్ని అభినందించాడు. వెంకీ మామ`.. మాస్ విలేజ్ ఎంటర్‌టైనర్. వెంకటేష్‌గారు, చైతూ నటన అద్భుతంగా ఉంది. మామా అల్లుళ్లు అదరగొట్టారు. గుడ్ వర్క్ బాబీ డార్లింగ్. సినిమా యూనిట్ మొత్తానికి అభినందనలు` అని అనిల్ రావిపూడి ట్వీట్ చేశాడు. సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న `సరిలేరు నీకెవ్వరు` చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa