ఇటీవల విడుదలైన యంగ్ హీరో నితిన్ భీష్మ మూవీ ఫస్ట్ గ్లిమ్ప్స్ వీడియో మంచి ఆదరణ దక్కించుకుంది. అయితే నితిన్ వివాహం పై ఓ ఆసక్తికర వార్త బయటికొచ్చింది. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఆయన ఓ ఇంటివాడు కాబోతున్నాడట. నటుడు నితిన్ తన కొత్త చిత్రం షూట్ లో బిజీగా ఉన్నాడు. కాగా ఈ యంగ్ హీరో వివాహం వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో జరుగుతుందని సమాచారం. ఈ వివాహం దుబాయ్ లో వైభవంగా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. గత కొంతకాలంగా తాను ప్రేమిస్తున్న అమ్మాయిని నితిన్ వివాహం చేసుకుంటున్నాడని సమాచారం జరుగుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa