హీరో సాయి తేజ్ హీరోగా మారుతి దర్శకుడిగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో రూపొందిస్తున్న సినిమా “ప్రతిరోజూ పండగే”. ఈ సినిమా డిసెంబర్ 20న విడుదల చేస్తున్నారు. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా సాయి తేజ్ మాట్లాడుతూ… మారుతిగారు నాకోసం అదిరిపోయే స్క్రిప్ట్ చేశారు. సినిమా చూశాక మీకు అర్థం అవుతుంది. ఐదేళ్ల క్రింద పిల్లా నువ్వులేని జీవితం విడుదలయ్యింది, మళ్ళీ ఇప్పుడు అరవింద్ గారితో ఈ సినిమా చేయడం సంతోషంగా ఉంది. సినిమా షూటింగ్ సమయంలో బాగా ఎంజాయ్ చేస్తూ చేశాం. డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ…. నాకోసం చెప్పిన వెంటనే సిక్స్ ప్యాక్ చేసుకొని తేజ్ ఈ సినిమా తీసాడు. సత్యరాజ్ గారు కథ విని ఈ సినిమా చేస్తానని ఒప్పుకున్నారు, సెట్స్ లో చాలా ఓపిగ్గా యాక్ట్ చేశారు, ఆయనను ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. మరి సాయి తేజ్ కి “ప్రతిరోజూ పండగే” సూపర్ హిట్ ఇచ్చేలానే ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa