తెలుగులో 'లవ్ లీ' సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రి ఇచ్చిన శాన్వి శ్రీవాస్తవ ప్రస్తుతం అతడే శ్రీమన్నారాయణ అనే సినిమాలో నటిస్తుంది. రక్షిత్ శెట్టి, శాన్వి శ్రీవాస్తవ జంటగా నటించిన ఈ సినిమాకు సచిన్ రవి దర్శకత్వం వహిస్తున్నారు. శాన్వి శ్రీవాస్తవ తెలుగులో లవ్ లీతో పాటు అడ్డా, రౌడీ సినిమాలు చేసింది. అయితే అడ్డా, రౌడీ సినిమాలు బాక్సాఫీసు ముందు బోల్తా కొట్టడంతో ఈ బ్యూటీకి అవకాశాలు రావడం పూర్తిగా తగ్గిపోయింది. దీంతో ఈ హీరోయిన్ మల్లి కన్నడంపై వెళ్ళింది. అక్కడ కూడా రెండు మూడు తప్ప అనుకున్నంత ఛాన్స్ లు ఏమీ రాలేదు. అయితే తాజాగా అతడే శ్రీమన్నారాయణ సినిమాలో ఈ అమ్మడు ఛాన్స్ కొట్టింది. తెలుగు, కన్నడ బాషలో వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 27న విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు. అయితే ట్రైలర్ లాంచ్ ఫంక్షన్ లో పాల్గొన్న హీరోయిన్ శాన్వి మాట్లాడుతూ స్టేజిపైనే కన్నీరు పెట్టుకుంది. తనలో ఉన్న నటనను నిరూపించుకునేందుకు దయచేసి అవకాశాలు ఇవ్వండి అని విన్నపించుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa