నాచురల్ స్టార్ నాని ప్రొడ్యూసర్ గా మారిన సంగతి తెలిసిందే. నాని తన రెండవ చిత్రంగా హిట్ అనే టైటిల్ తో నిర్మిస్తున్నారు. ఈ నగరానికి ఏమైంది..?, ఫలక్ నుమా దాస్ వంటి చిత్రాలలో నటించిన హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ జరుపుకుంటుంది. కాగా నేడు ఈ మూవీ నుండి విశ్వక్ సేన్ లుక్ విడుదల చేశారు. కాగా విశ్వక్ హిట్ మూవీలో విక్రమ్ రుద్రరాజు అనే సీరియస్ ఐ పి ఎస్ అధికారి పాత్ర చేస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ గ్లిమ్ప్స్ వీడియో 2020 జనవరి 1న న్యూ ఇయర్ కానుకగా విడుదల చేయనున్నారు. హిట్ మూవీకి డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa