యంగ్ హీరో నాగ శౌర్య నూతన దర్శకుడు రమణ తేజ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నా మూవీ అశ్వథామ. వైజాగ్ నేపథ్యంలో నడిచే అశ్వథామ చిత్రం కొరకు హీరో నాగ శౌర్య పూర్తిగా మేక్ ఓవర్ అయ్యాడు. ఈ చిత్రం కోసం సిక్స్ ప్యాక్ డెవలప్ చేసిన ఆయన తనని తాను ఓ మాస్ హీరోగా ఆవిష్కరించుకోనున్నాడనని తెలుస్తుంది. అన్యాయాలను ప్రశ్నించే యువకుడిగా నాగ శౌర్య రోల్ ఉంటుందిట. ఇక ఈ చిత్ర టీజర్ డేట్ ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్. ఈనెల 27న ఉదయం 11:07 గంటలకు ఈ చిత్ర టీజర్ విడుదల చేయనున్నారట. నేడు ఓ పోస్టర్ విడుదల చేయడం ద్వారా ఈ విషయం తెలియజేశారు. ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఉషా ములుపురి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగ శౌర్య కు జంటగా మొదటిసారి మెహ్రీన్ నటిస్తుంది. శ్రీ చరణ్ పాకల్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 31న విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa