ప్రస్తుతం హీరో నాగ శౌర్య అశ్వథ్థామ చిత్రంలో నటిస్తున్నాడు. రమణ తేజ దర్శకుడిగా ఈ చిత్రంతో పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రం ఐరా క్రియేషన్స్ పతాకం పై శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మాతలుగా ప్రొడక్షన్ నెం 3 గా రాబోతునుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ జనవరి 31 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్ కార్య క్రమాలను మొదలు పెట్టి సినిమా ఫై ఆసక్తి నింపుతున్నారు చిత్ర యూనిట్. తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ వీడియో సాంగ్ 'నిన్నే నిన్నే' వచ్చి ఆకట్టుకోగా..తాజాగా ఫస్ట్ లుక్ టీజర్ టీజర్ రిలీజ్ డేట్ ప్రకటించి ఆసక్తి నింపారు. ఈనెల 27న ఉదయం 11:07 గంటలకు ఈ చిత్ర టీజర్ విడుదల చేయనున్నట్లు ప్రత్యేక పోస్టర్ ద్వారా అధికారిక ప్రకటన చేశారు. ఈ టీజర్ విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిధిగా అక్కినేని సమంత రావడం విశేషం. ఆమె చేతుల మీదుగా ఈ టీజర్ రిలీజ్ చేయబోతున్నారు. సమంత నటించిన ఓ బేబీ చిత్రంలో నాగ శౌర్య సమంత కు జోడిగా నటించిన సంగతి తెలిసిందే. అప్పటినుండి వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడడం తో ఆ స్నేహం కారణంగా శౌర్య పిలుపు మేరకు ఆమె ఓకే చెప్పినట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa