విక్రమ్ నటిస్తున్న 58వ చిత్రానికి ఆసక్తికరమైన టైటిల్ ఫిక్స్ చేసాడు. 'డిమాంటి కాలనీ,' 'ఇమైక్కా నొడికల్' వంటి థ్రిల్లర్ చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పించిన దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి 'కోబ్రా' అనే పేరు పెట్టారు. అజయ్ గత చిత్రాల తరహాలోనే యాక్షన్ థ్రిల్లర్ బాణీలోనే ఇది కూడా రూపొందుతోంది. క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఈ చిత్రం ద్వారా సినీ ఆరంగేట్రం చేస్తుండగా, దర్శకుడు కేఎస్ రవికుమార్, కన్నడతార శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రంలో విక్రమ్ 20కిపైగా గెటప్‌లలో కనిపిస్తారని సమాచారం. 'కోబ్రా' అనే టైటిల్ పెట్టడంతో ఈ చిత్రం ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa