కొరటాల శివల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 152 చిత్రం త్వరలో సెట్స్ మీదికి వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను రామ్ చరణ్, నిరంజన్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మెగా అభిమానులకు ఈ ప్రాజెక్ట్ మీద అంచనాలు భారీగా ఉన్నాయి. కొరటాల అందుకే సినిమాలో చిరును కొత్తగా, స్టైలిష్ లుక్ లో చూపించాలని డిసైడ్ అయ్యారు . ఆ లుక్ కోసం షూటింగ్ సైతం పక్కనబెట్టి ఎదురుచూశారు. ఇప్పటికే పలుసార్లు లుక్ టెస్ట్ చేశారు. ఎట్టకేలకు ఫైనల్ లుక్ టెస్ట్ ద్వారా కొరటాల చిరుకు తాను అనుకున్న లుక్ వచ్చిందని నిర్ణయించుకున్నారట. అంతేకాదు ఆ లుక్ పట్ల ఆయన చాలా సంతృప్తిగా ఉన్నారట. దీంతో రెగ్యులర్ షూట్ మొడలుపెట్టడానికి రెడీ అయ్యారు. జనవరి ఆరంభంలో చిత్రీకరణ మొదలుకానుంది. సీనియర్ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa